ETV Bharat / lifestyle

ఆ 11 కుటుంబాల కోసం 11 గంటలు నడిచి వెళ్లిన సీఎం.. - Arunachal CM pema khandu

మన ముఖ్యమంత్రులు కాలు బయటపెడితే చాలు కాన్వాయ్‌లూ, భారీ భద్రతా సిబ్బంది వాహనాలూ బారులు తీరతాయి. కానీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 11 గంటలపాటు 24 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ అక్కడి ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఇంతకీ ఆ సీఎం ఎవరు? ఎందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది?

Arunachal CM pema khandu
అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ
author img

By

Published : Oct 5, 2020, 12:35 PM IST

ఈ మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ మాత్రం అలాంటి మందీమార్బలం ఏమీ లేకుండానే జనజీవన స్రవంతికి దూరంగా ఉండే లగుతంగ్‌ అనే గ్రామానికి వెళ్లారు. అది ఖండూ నియోజకవర్గంలోని తవాంగ్‌ జిల్లాలో సముద్రమట్టానికి దాదాపు పదిహేనువేల అడుగుల ఎత్తులో ఓ కొండపై ఉంది.

దాదాపు పదకొండు గంటలపాటు 24 కిలోమీటర్లు నడుచుకుంటూనే ఆ కొండనెక్కి ప్రజల బాగోగులు తెలుసుకున్నారు ఖండూ. అక్కడ పదకొండు కుటుంబాల్లో కేవలం యాభై మంది మాత్రమే నివసిస్తారు. పదకొండేళ్ల క్రితం ఆ ప్రాంతంలోనే విమానం కుప్పకూలి ఖండూ తండ్రి మరణించారు. అందుకే అక్కడి ప్రజల్లో తన తండ్రిని చూసుకోవడానికి తరచూ వెళుతుంటారాయన.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.