ETV Bharat / lifestyle

ఈ దీపావళికి మతాబుల్లాంటి చాక్లెట్లు వస్తున్నాయి.. - cracker sweets

ప్రతి ఏడాదీ వచ్చినట్లే ఈ దీపావళికి కూడా సింధు స్వీటు బాక్సుతో స్నేహితురాలు ప్రియ ఇంటికి వచ్చింది. ‘ఈసారి స్వీట్లు కాదు, పిల్లలకిష్టమైన చాక్లెట్లు తెచ్చాను’ అంటూ బాక్సుని చేతికందించింది. సింధు వెళ్లాక ఆ బాక్సు తెరిచిన ప్రియ ఒక్కసారిగా షాకైంది. ఎందుకంటే అందులో రకరకాల టపాసులున్నాయి. ‘ఇదేంటీ చాక్లెట్లు అంది కదా పొరపాటున బాక్సు మారిందేమో’ అనుకుంది. కానీ సరిగ్గా చూస్తే తెలిసిందేమిటంటే అవి చాక్లెట్లే. ఇప్పుడు దీపాల పండుగ కోసం అచ్చంగా మతాబుల్లాంటి చాక్లెట్లు వస్తున్నాయి మరి.

sweet crackers for Diwali Festival celebrations
మిఠాయిలే మతాబులు
author img

By

Published : Nov 8, 2020, 1:27 PM IST

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. టపాసుల వేడుక. తియతియ్యని మిఠాయిలతో ఆత్మీయుల నోరు తీపి చేస్తాం. కష్టాల చీకట్లను దూరం చెయ్యమని దేవుడిని వేడుకుంటూ ముంగిట్లో దీపాలు వెలిగిస్తాం. ఆ కాంతులు నింగీనేలా నిండిపోయేలా రకరకాల టపాసులు కాల్చుతాం. ఎప్పట్నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి సరికొత్తగా జతచేరిన సంప్రదాయమే టపాసుల మిఠాయిలు. అవును, చిచ్చుబుడ్డి, విష్ణుచక్రం, కాకరపువ్వొత్తులు, రాకెట్‌లు, లక్ష్మీ బాంబులూ, సుట్లి బాంబులూ, సీమ టపాకాయలూ... ఇలా అచ్చం మతాబుల్లా ఉన్న చాక్లెట్లు వస్తున్నాయి ఇప్పుడు. వీటిని చూస్తే అవి టపాసులు కావంటే నమ్మలేం. వేరు వేరు మతాబుల ఆకారాల్లో ఉండే అచ్చుల్లో చాక్లెట్‌ సిరప్‌ని పోసి, అవి గట్టి పడ్డాక మతాబులకు అంటించేలాంటి స్టిక్కర్లను వాటికి అంటిస్తారు. అంటే, మౌల్డ్‌తో చిచ్చుబుడ్డిలాంటి చాక్లెట్‌ని తయారుచేసి దానికి నిజమైన చిచ్చుబుడ్డికి ఉండే కాగితాన్ని పోలిన రేపర్‌నే చుడతారన్నమాట. కాబట్టి ఇవి చూడ్డానికి అచ్చం చిచ్చుబుడ్డిలానే ఉండి ఎవరినైనా అవాక్కయ్యేలా చేస్తాయి.

కానుకగా..

దీపావళికి ఆత్మీయులకీ బంధువులకీ మిఠాయిలను పంచడం సంప్రదాయం. కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఉద్యోగులకు స్వీట్లను పంచుతుంటాయి. అయితే, ఎవరికైనా కానుకగా ఇచ్చేటపుడు కాస్త ప్రత్యేకంగా ఇవ్వాలనుకోవడం సహజం. అందుకే, ఈ ‘క్రాకర్స్‌ చాక్లెట్లు’ దివాలీ కానుకలుగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీపావళి అనగానే గుర్తొచ్చే టపాసుల ఆకారంలో ఉండడం వల్ల వీటిని చూస్తేనే పండుగ సంబరమంతా కనిపించేస్తుంది. ఇక, టపాకాయలంటేనే పిల్లలకు బోలెడంత ఇష్టం. పండుగకు కొన్నిరోజుల ముందునుంచే పిస్టళ్లు పేల్చడం మొదలుపెట్టేస్తారు. అలాంటిది మతాబుల్లా ఉన్న చాక్లెట్లను చూస్తే వారి కళ్లల్లో కాకరపువ్వొత్తుల కాంతులు కనిపించకుండా ఉంటాయా... ‘అమ్మా నేను చిచ్చుబుడ్డి తింటా... నేను విష్ణుచక్రం తింటా’ అంటూ గంతులెయ్యకుండా ఉంటారా..? అన్నట్లూ మరీ చంటి పిల్లలకు ఈ టపాసుల చాక్లెట్లను రేపర్‌ తియ్యకుండా నేరుగా ఇచ్చేయకండేం. ఎందుకంటే, తరవాత నిజం టపాసుల్ని చూసికూడా చాక్లెట్లు అనుకుని నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది... జాగ్రత్త సుమండీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.