ETV Bharat / lifestyle

సగం మగ.. సగం ఆడ.. ఆకట్టుకుంటున్న పక్షి - Northern Cardinal bird in Illinois

మహా శివుడు అర్ధ నారీశ్వరుడు అంటారు. అంటే ఆయనలో సగ భాగం పార్వతీ దేవి ఉంటుందని అర్థం. ఆశ్చర్యం ఏంటంటే... ఇలాగే అమెరికాలోని ఇల్లినాయిస్‌లో సగం మగ సగం ఆడ ఉన్న ‘నార్తన్‌ కార్డినల్‌’ పక్షిని గుర్తించారు శాస్త్రవేత్తలు.

Northern Cardinal bird
నార్తన్ కార్డినల్ పక్షి
author img

By

Published : Nov 8, 2020, 2:32 PM IST

అమెరికాలోని ఇల్లినాయిస్​లో ఓ వింత పక్షి( నార్తన్ కార్డినల్)ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా ఈ పక్షుల్లో మగది ఎరుపు రంగులోనూ ఆడది బూడిద వర్ణంలోనూ ఉంటుందట. కానీ ఓ పక్షి మాత్రం ఇందుకు భిన్నంగా సగం మగ పిట్ట రంగులోనూ సగం ఆడపిట్ట వర్ణంలోనూ ఉందట. పైగా దీనికి జంట పక్షి కూడా లేదు.

ఈ జాతి మగ పక్షులు కూత కూస్తూ పాడతాయి. ఈ పిట్ట పాడనూ పాడట్లేదు. దాంతో శాస్త్రవేత్తలు కొన్ని రోజులపాటు దీని గురించి అధ్యయనం చేసి ఈ పక్షి ‘బైలేటరల్‌ గైనాండ్రొమార్ఫిజమ్‌’ అనే జన్యు సమస్య కారణంగా ఇలా జన్మించిందని తేల్చారు. అంటే... ఈ పక్షి అవయవాలు కూడా ఒకవైపు ఆడ, మరోవైపు మగ పక్షికి ఉన్నట్లే ఉంటాయి. వింతగా ఉంది కదూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.