ETV Bharat / lifestyle

పూలవేజుకు... మగువ సొగసు..!

ఇంటి అలంకరణలో ఎన్ని అత్యాధునిక ట్రెండ్‌లు వచ్చినా మన సంప్రదాయం కలగలిసిన కళాకృతులు తెచ్చే అందం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక, చక్కగా అలంకరించుకున్న భారతీయ మగువల ముఖంలో కనిపించే కళే వేరు. అందుకే, అందమైన అతివలూ రాజసం ఉట్టిపడే మగమహారాజుల త్రీడీ ముఖాలతో వస్తున్న పెద్ద పెద్ద వేజులు ఇప్పుడు ఇంటికి కొత్త కళను తెచ్చిపెడుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా?

flower vase new designs, designs for flower vase
ఫ్లవర్ వేజ్ డిజైన్లు, పూలవేజు డిజైన్లు
author img

By

Published : May 9, 2021, 4:55 PM IST

ఇంట్లో ఎన్ని అందమైన వస్తువులున్నా పూల వేజుల ప్రత్యేకతే వేరు. మరి అవి భారతీయత ఉట్టి పడేలా ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన అతివలు, రాజసం ఉట్టిపడే మగమహారాజుల త్రీడీ ముఖాలతో వస్తున్న పెద్ద పెద్ద వేజులు ఇప్పుడు ఇంటికి కొత్త కళను తీసుకొస్తున్నాయి. అందంగా ఆహ్లాదంగా కనిపించడానికి వేజుల్లో రంగు రంగుల పూలను అమర్చుతుంటాం. అయితే, చిన్న వేజుల్లో పువ్వుల్ని గుత్తుగా పెడితే వాటికింద ఉన్న వేజ్‌ అంతగా కనిపించదు. కాబట్టి, ఆ వేజులకి అందంతో పెద్దగా పనిలేదు. కానీ పూలతో పాటు వేజుని కూడా ఓ కళాకృతిలా అమర్చాలనుకునేవారు ఇంచు మించు టేబుల్‌ అంత ఎత్తులో ఉండే కూజా వేజుల్ని తెచ్చి పెడుతుంటారు.

ఇదో కొత్త ట్రెండ్

మట్టి, పింగాణీ, ఫైబర్‌లతో చేసిన ఈ పెద్ద కూజాలు ఇన్నాళ్లూ రకరకాల ప్రింట్లూ పెయింటింగులతో వచ్చేవి. అవీ అందంగానే ఉండేవి కానీ మరీ చూడగానే కళ్లప్పగించేసే అంత ప్రత్యేకంగా ఉన్నవైతే అరుదే. కొత్తగా వస్తున్న ఈ త్రీడీ ఫేస్‌ వేజ్‌లు మాత్రం అందుకు భిన్నం. వీటిని చూస్తే ఎవరైనా మనసుపారేసుకోవాల్సిందే. ‘అబ్బ ఎంత బాగుందో’ అంటూ దగ్గరికెళ్లి మళ్లీ మళ్లీ చూడాల్సిందే.

ఉట్టిపడుతున్న భారతీయత

పెద్ద పెద్ద కళ్లూ చూడచక్కని ముఖంతో నిండుగా అలంకరించుకున్న అతివలూ... ధైర్యం నిండిన కళ్లు, బుర్ర మీసాలూ, తలపాగాలతో భారతీయత కొట్టొచ్చినట్లు కనిపించే మగమహారాజుల రూపాలతో చేసిన టెర్రకోట కళాకృతులు మామూలుగానే బాగా ఆకట్టుకుంటాయి. అందుకే, చాలామంది వాటిని ఇష్టంగా ఇంట్లో అలంకరించుకుంటారు. అయితే, అటు బొమ్మ ఇటు వేజు రెండూ ఒకేదాంట్లో కనిపించేలా రూపొందుతున్నవే త్రీడీ ఫేస్‌ వేజులు.

అచ్చం బొమ్మలాగే..

అచ్చం బొమ్మలానే...
నిజంగా అది బొమ్మేనేమో అనిపించేలా మట్టి, ఫైబర్‌లతో చేసిన కూజాల పైన వేరు వేరు ముఖాకృతులను రూపొందించడం వీటి ప్రత్యేకత. ఇంకా చిత్రం ఏంటంటే కొన్ని కూజాలమీదున్న బొమ్మలకు మేలిముసుగుని నిజమైన వస్త్రంతో తయారుచేసి అంటిస్తారు. ఇలాంటివైతే నిజంగానే అక్కడ అమ్మాయి కూర్చుని ఉందా అనేంత భ్రమ కలిగిస్తాయి. ఇక, వీటిలో రంగు రంగుల్లో విరబూసిన సహజమైన లేదా కృత్రిమ పూల కొమ్మల్ని అలంకరిస్తే ఇంకెంత సొగసుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పేదేముందీ...

ఇవి వేరు వేరు ఆన్‌లైన్‌ దుకాణాల్లో దొరుకుతున్నాయి. మీకూ కావాలంటే ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

ఇదీ చదవండి: అమానుషం: కరోనా సోకిందని మాతృమూర్తిని ఇంట్లోనేే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.