చెన్నైకి చెందిన లక్ష్మిసాయిశ్రీ వంటకాలతో ప్రపంచ రికార్డు సృష్టించింది. అతి తక్కువ సమయంలో అధిక వంటకాలు తయారు చేసి ప్రతిష్ఠాత్మక ‘యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. ఆమె కేవలం 46 నిమిషాల్లోనే 58 వంటకాలు వండి ఈ రికార్డు సాధించింది. యునికో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
‘'లాక్‌డౌన్ సమయంలో నా కుమార్తె నాతో వంట గదిలో సమయం గడిపేది. అప్పుడే ఆమెకు వంటలు వండటంపై ఆసక్తి ఏర్పడి ఇష్టంగా నేర్చుకుంది. ఎంతో చలాకీగా వండుతుంది. అందుకే ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నించమని వాళ్ల నాన్న సలహా ఇచ్చాడు'’ అని బాలిక తల్లి కలైమాగల్ పేర్కొన్నారు. గతంలో ఈ రికార్డు కేరళకు చెందిన పదేళ్ల బాలిక సాన్వి పేరిట ఉండేది. ఆమె 30 వంటకాలు తయారు చేసి ఈ ఘనత సాధించింది. తాజాగా సాన్వి రికార్డును లక్ష్మీ బద్దలు కొట్టింది.
- ఇదీ చూడండి : బండ పేరుతో అడ్డగోలుగా బాదుడు..