ఏపీలోని గుంటూరు కొత్తపేటకు చెందిన లక్ష్మీ ప్రమీల.. సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రామాయణం, మహా భారతంవంటి పురాణ ఇతిహాసాలను కళ్లకు కట్టడంతోపాటు మన తెలుగు సంప్రదాయ పండుగల విశిష్ఠతను తెలియజెప్పేలా.. తీర్చిదిద్దారు. జంతువులు, పక్షులు, తర తరాల ప్రయాణ సాధనాలు ఇలా మన జీవనగమనంలో.. భాగమైన అనేక ఇతివృత్తాలు ప్రతిబింబించేలా.. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.
ఇరుగుపొరుగువారితోపాటు..బంధువులందరినీ బొమ్మల కొలువుకు ఆహ్వానించారు ప్రమీల. వారంతా పిల్లలతో కలిసి వచ్చి.. వాటి విశిష్టతను తెలుసుకున్నారు. కనుమరుగవుతున్న సంప్రదాయాలను నేటి తరాలకు అందించడమే తన ద్దేశమంటున్నారు లక్ష్మీ ప్రమీల.
బొమ్మల కొలువుతో రెండురకాల ప్రయోజనాలు నెరవేరతాయని.. అందరూ మెచ్చుకున్నారు. వందలాది బొమ్మలను అందంగా వరుసలో ఉంచిన లక్ష్మీ ప్రమీలను అభినందించారు.
ఇదీ చదవండి: జీవన సరళి మారుతోంది.. నాటి సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది!