సూర్యాపేట జిల్లా నాగారం తహసీల్దార్ గొబ్బిళ్ల శ్రీకాంత్ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేయించారని తెలంగాణ సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు అఖలపక్షం ఆధ్యర్వంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
తనపై దాడిని ముందే ఊహించానని, దీనిపై జిల్లా ఎస్పీ, కలెక్టర్కు సమాచారం అందించానని ఆయన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని ఆరోపించారు. తనపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.