ETV Bharat / jagte-raho

వీడియో: యువతితో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్​పై దాడి

యువతితో అసభ్యంగా ప్రవర్తించడం సహా కానిస్టేబుల్​పై చేయిచేసుకున్న యువకుడిని హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం అర్ధరాత్రి అమీర్​పేట సమీపంలోని బస్టాండ్​ వద్ద ఈ ఘటన జరిగింది.

panjagutta police
యువతితో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్​పై దాడి
author img

By

Published : Nov 8, 2020, 11:42 AM IST

Updated : Nov 8, 2020, 12:59 PM IST

హైదరాబాద్​లో యువతిని వేధించడం సహా కానిస్టేబుల్​పై చేయిచేసుకున్న ఘటనలో అమీర్​పేటకు చెందిన మహేశ్​ అనే వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువతితో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్​పై దాడి

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి ఓ శుభకార్యం కోసం హైదరాబాద్​ వచ్చింది. తిరిగి వెళ్లేందుకు శనివారం అర్ధరాత్రి అమీర్​పేట సమీపంలోని బస్టాండ్​ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా... తనతో మహేశ్​ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆ యువకుడు దురుసుగా ప్రవర్తించడం సహా కానిస్టేబుల్​పై చేయి చేసుకున్నాడు. ఫలితంగా మహేశ్​పై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు. ఘటన జరిగిన సమయంలో మహేశ్​ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. యువకుడిని ఇవాళ రిమాండ్​కు తరలించనున్నట్టు వెల్లడించారు.

ఇవీచూడండి: జీహెచ్​ఎంసీ కార్మికురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... పరిస్థితి విషమం

Last Updated : Nov 8, 2020, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.