ETV Bharat / jagte-raho

యువతి కిడ్నాప్​ కలకలం.. విడిపించిన పోలీసులు - jagitial district news

కొడిమ్యాల మండలంలో యువతి కిడ్నాప్​ కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న యువతిని అతని సోదరుడు, స్నేహితుల సాయంతో బలవంతంగా కారులో తీసుకెళ్లారు. పోలీసులు గాలింపు చేపట్టి బాధితురాలిని విడిపించారు.

young woman was kidnapped in jagitial district
యువతి కిడ్నాప్​ కలకలం.. విడిపించిన పోలీసులు
author img

By

Published : Nov 10, 2020, 4:06 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం పొరండ్ల యువకుడు, సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ యువతి ఈ నెల 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. మరునాడే యువతి సోదరుడు, అతని స్నేహితులు బలవంతంగా ఆమెను పొరండ్ల నుంచి కారులో తీసుకెళ్లారు. దీనితో ఆమె భర్త వేముల రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొడిమ్యాల మండలంలో ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరికి చెప్యాల గ్రామంలో అభిరామ్ అనే వ్యక్తి ఇంట్లో దాచినట్టు గుర్తించి బాధితురాలిని విడిపించారు. నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి: జల్సాల మోజులో దొంగతనం.. 7 బైక్​లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.