వికారాబాద్ జిల్లా కోటపల్లిలో గోనెసంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి పాతిపెట్టారు. మృతదేహాన్ని శునకాలు పీక్కుని తింటుంటే పశువుల కాపర్లు గుర్తించి సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు.
సర్పంచ్ రాధ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శవాన్ని స్వాధీనం చేసుకోని వికారాబాద్ అసుపత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, చంపిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.