ETV Bharat / jagte-raho

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య - జోగులాంబ గద్వాల జిల్లాలో యువతి ఆత్మహత్య

ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఒకే ఊరు ఒకే కులం కావడంతో ఇంట్లో వాళ్ల అభ్యంతరం ఉండదనుకుంది ఆ యువతి. కానీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

young woman committed suicide in jogulamba gadwal district
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని.. యువతి ఆత్మహత్య
author img

By

Published : Dec 8, 2020, 8:37 AM IST

ప్రేమించిన యువకుడిని ఇచ్చి పెళ్లి చేయలేదని ఆత్మహత్యకి పాల్పడింది ఓ యువతి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నదీ అగ్రహారానికి చెందిన గాయత్రి(21), అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసిన గాయత్రి.. వారు ఒప్పుకోకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సోమవారం మధ్యాహ్నం.. పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.