కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీమల శ్వేత.. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మరణించింది. యువతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'