ఈత నేర్చుకుంటూ చెరువులో యువకుడు గల్లంతైన ఘటన... కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన ఆకిటి రాజిరెడ్డి, మంజులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినయ్‌రెడ్డి నేవీలో ఉద్యోగం సాధించి, శిక్షణ పొందుతున్నాడు. సోదరుడి స్ఫూర్తితో విఘ్నేష్ రెడ్డి కూడా నేవీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 20 రోజుల నుంచి కామారెడ్డి పెద్ద చెరువులో... తండ్రి రాజిరెడ్డి సహకారంతో ఈత నేర్చుకుంటున్నాడు.
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కూడా ఉదయం 6 గంటలకు చెరువు దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో 7 గంటల సమయంలో ఈత కొడుతూ... కొద్ది దూరం వెళ్లి మునిగిపోయాడు. కుమారుడిని కాపాడేందుకు రాజిరెడ్డి విశ్వప్రయత్నం చేశాడు కానీ... ఫలించలేదు. స్థానికుల సమాచారంతో మధ్యాహ్నం తర్వాత గజఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే సమయానికి కూడా ఆచూకీ లభించలేదు. దీంతో ఇవాళ ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బంధువులు చెరువు వద్దకు వచ్చి బోరున విలపిస్తున్నారు.
ఇదీ చూడండి: గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు