ETV Bharat / jagte-raho

కల నెరవేరలేదని తనువు చాలించాడు... - నాగర్​కర్నూల్ జిల్లా నేర వార్తలు

ఆర్మీలో కొలువు సాధించాలని ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు. అందుకోసం చాలాకాలంగా సన్నద్ధమవుతున్నాడు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతో తాపత్రయపడ్డాడు. పరీక్ష రోజు రానే వచ్చింది. తీరా చూస్తే ఆలస్యం రూపంలో అతనికి యమపాశంలా ఎదురైంది.

young man suicide in nagarkurnool for army job
ఆర్మీ ఉద్యోగం కోసం... ఆలస్యం రూపంలో యమపాశం
author img

By

Published : Nov 25, 2020, 1:57 PM IST

నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాయలేదని మనస్థాపంతో శ్రీకాంత్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నవంబర్ 24న హైదరాబాదులో జరిగిన ఆర్మీ ప్రవేశ పరీక్షకు రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో... అధికారులు అనుమతించలేదు. పరీక్ష రాయలేదని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఎలాగైనా ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావాలనే లక్ష్యంతో చాలా రోజులుగా సన్నద్ధమైన యువకుడు... పరీక్ష రాయని కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని మృతుని సన్నిహితులు పేర్కొన్నారు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: పెట్రోల్​ పోసుకొని కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.