ETV Bharat / jagte-raho

దారుణం: నాలుగేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం! - విజయ నగరం జిల్లాలో నేరాలు

అభం శుభం తెలియని వయస్సు..కల్మషం లేని మనస్సు..ముద్దు ముద్దుగా పలికే మాటలు... బుడి బుడి పాదాలతో.. తడబడుతూ అడుగులు వేసే నాలుగేళ్ల చిన్నారి ఓ కామాంధుడి కోరల్లో చిక్కుకుంది. డిగ్రీ చదువుతున్న యువకుడు ఆడిస్తానంటూ బాలికను తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీ విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

దారుణం: నాలుగేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం!

author img

By

Published : Nov 26, 2020, 11:00 PM IST

నాలుగేళ్ల చిన్నారిపై డిగ్రీ చదువుతున్న యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీ విజయనగరం జిల్లా భోగారం మండలం పోలిపల్లిలో జరిగింది. చిన్నారి ఇంటి పక్కన నివసించే యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాపను ఆడిస్తానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసి, అనంతరం బాలికను నాన్నమ్మకు అప్పగించాడు. మధ్యాహ్నం సమయంలో చిన్నారికి భోజనం తినిపిస్తుండగా కడుపునొప్పి అంటూ ఏడుస్తూ చెప్పింది.

వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు యువకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే చర్యలేందుకు తీసుకోవట్లేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.