ETV Bharat / jagte-raho

స్నేహంతో నమ్మించాడు.. చంపేశాడు! - పెద్దపల్లి జిల్లా వార్తలు

యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. స్నేహితులే మధుకర్​ అనే యువకుడిని తలపై బలంగా కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. వీరికి పాతకక్షలున్నాయా? వేరే కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Murdered in Godavari Khani Town
స్నేహంతో నమ్మించాడు.. చంపేశాడు!
author img

By

Published : Aug 29, 2020, 10:20 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడిని జయశంకర్ భూపాలజిల్లా అడవి ముత్తరం మండలం కనుకునూరుకు చెందిన చెన్నూరు మధుకర్​గా గుర్తించారు. మధుకర్​ గత నాలుగేళ్లుగా గోదావరిఖనిలో మిషన్​ పని చేసుకుంటూ లెనిన్ నగర్​లోని మహంకాళి సారయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో మధుకర్​కు గద్దెల వంశీ, అరుణ్ కుమార్ అనే ఇద్దరు యువకులతో పరిచయం అయింది. తక్కువ సమయంలోనే స్నేహితులయ్యారు.

శుక్రవారం నాడు వంశీ తన స్కూటీపై మధుకర్​ను అరుణ్ కుమార్ ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ్ కుమార్​ను ముఖం కడుక్కుని రమ్మని పంపాడు. అరుణ్​ తిరిగి వచ్చేసరికి మధుకర్​ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియక మధుకర్​ నిశ్చేష్టుడయ్యాడు. తల పగిలి, మెదడు చిట్లి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని వన్​టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ, మధుకర్​కు ఏమైనా పాత పగలు ఉన్నాయా ? లేదా మరేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.