తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడన్న కారణంగా ఓ యువతి.. యువకుడిని హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో చోటు చేసుకొంది. కత్తితో పొడిచి హత్య చేసిన యువతి.. మృతుడి పక్కనే ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోవడం సంచలనం రేపింది.
తాడేపల్లిగూడెంకు చెందిన తాతాజీనాయుడు, పావని రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేమించి.. పెళ్లికి నిరాకరిస్తున్నాడన్న కారణంగా పావని.. తాతాజీరావును హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. మృతుడు తాతాజీనాయుడు తాడేపల్లిగూడెం నుంచి అమ్మాయిని కలవడానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. పావని యువకుడిని కత్తితో పలుమార్లు పొడవడంతో అక్కడక్కడే మృతి చెందాడు. యువతిని అదుపులోకి తీసుుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రేమించివాడు పెళ్లాడలేదని.. యువతి ఆత్మహత్య