భార్య కాపురానికి రాలేదని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కోడేరులో చోటుచేసుకుంది. భార్య దసరా పండగకు హైదరాబాద్ వెళ్లింది. బుధవారం నాడు సుధాకర్ తన భార్యకు ఫోన్ చేసి కోడేరుకు రావాలని కోరాడు.
అయితే ఇంటికి రావడం లేదని మనస్థాపం చెందిన సుధాకర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి చెప్పారు.
ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి