ETV Bharat / jagte-raho

కత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య - తెలంగాణ నేర వార్తల

ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వాది ఏ ముస్తాఫా ప్రాంతానికి చెందిన సయ్యద్ మొమిన్ అలీ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.

కత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య
కత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య
author img

By

Published : Sep 23, 2020, 3:41 PM IST

రంగారెడ్డి జిల్లా బాలాపూర్​ ఠాణా పరిధి వాది ఏ ముస్తాఫాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని.. దుండగులు దారికాచి కత్తులతో దాడి చేసి హత్యచేశారు. వాది ఏ ముస్తఫా ప్రాంతానికి చెందిన సయ్యద్ మొమిన్ అలీ బుధవారం తెల్లవారు జామున ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు ఖలీద్​తో కలిసి మరో స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన మొమిన్​ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న బాలాపూర్​ పోలీసులు క్లూస్​టీంతో ప్రమాద స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: జాతకంలో దోషమన్నాడు... తాళికట్టి నువ్వే నా భార్య అన్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.