ETV Bharat / jagte-raho

ఫొటోలు సేకరించి.. నగ్నంగా వీడియోకాల్​ చేయాలని బెదిరింపులు - ఎల్బీనగర్ వార్తలు

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫోన్​ నంబర్​ తీసుకున్నాడు. ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకుని... వ్యక్తిగత ఫొటోలు సంపాదించాడు. వాటిని అడ్డం పెట్టుకుని నగ్నంగా వీడియో కాల్​ చేయాలని బెదిరించాడు. భయపడి ఆ మహిళ అతను చెప్పినట్టే చేసినా... అంతటితో ఆగకుండా రోజూ అలానే చేయాలని ఒత్తిడి పెంచాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

లు సేకరించి.. నగ్నంగా వీడియోకాల్​ చేయాలని బెదిరింపులు

author img

By

Published : Jan 10, 2021, 9:10 AM IST

ఓ మహిళను సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని నగ్నంగా వీడియో కాల్​ చేయాలని వేధిస్తోన్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం పూలపర్తికి చెందిన భార్గవన్... సామాజిక మాధ్యమాల ద్వారా ఎల్బీనగర్​లో నివాసముండే ఓ మహిళ ఫోన్​ నంబర్​ సేకరించాడు. గతేడాది మేలో మొబైల్​కు ఓ సందేశం పంపాడు. క్రమంగా పరిచయం పెంచుకొని మహిళ వ్యక్తిగత చిత్రాలు సేకరించాడు.

ఇదే అదునుగా చేసుకుని వీడియో కాల్​ చేసి నగ్నంగా కనిపించాలని ఒత్తిడి పెంచాడు. లేకపోతే వ్యక్తిగత చిత్రాలను కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తానని భయపెట్టాడు. సదరు మహిళ భయపడి... భార్గవన్ చెప్పినట్లు నగ్నంగా వీడియో కాల్ చేసింది. వాటిని రికార్డు చేసుకున్న భార్గవన్ మరిన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. రోజూ నగ్నంగా వీడియో కాల్ చేయాలని ఒత్తిడి పెంచాడు.

భార్గవన్ వేధింపులు తట్టుకోలేక చివరికి ఈ విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. కుటుంబసభ్యుల సాయంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేశారు. భార్గవన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా.. యుద్ధప్రాతిపదికన సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.