సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తతో గొడవపడి.. వేరుగా ఉంటుంది. వీరికి కూతురు శ్రావణి ఉంది. ఈమె తల్లి వద్దే ఉంటుంది. ఆదివారం ఇంట్లో తల్లి లేని సమయంలో శ్రావణి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
శ్రావణికి పక్కింటి యువకుడితో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. ఈ విషయంలోనే తల్లి మందలించటంతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పక్కింటి యువకుడు కొన్ని రోజులుగా తన కూతురు వెంట పడుతున్నాడని తల్లి విజయలక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: కల్తీకల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి