ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు.
ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.