ETV Bharat / jagte-raho

'నా భర్త నన్ను మోసం చేశాడు.. న్యాయం చేయండి' - యాదాద్రి నేర వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తన భర్తపై కేసు నమోదై పది రోజులైనా నిందితుడిని అరెస్టు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

women protest at ramannapet, yadadri bhongir district
'నా భర్త నన్ను మోసం చేశాడు.. న్యాయం చేయండి'
author img

By

Published : Oct 9, 2020, 1:58 PM IST

తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకొని వదిలేసిన ముక్కాంల దుర్గయ్యను వెంటనే అరెస్టు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. కేసు నమోదై పది రోజులైనా నిందితుడిని అరెస్టు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రామన్నపేటకు చెందిన ముక్కాంల దుర్గయ్య ఓ మహిళను మాయమాటలతో మోసగించి రెండో వివాహం చేసుకున్నాడు. దుర్గయ్యకి గతంలోనే వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య, పిల్లలు నారాయణ పేటలో నివసిస్తున్నారు. కాగా... రామన్నపేటకి చెందిన ఓ మహిళను 2018లో రెండో వివాహం చేసుకున్నాడు. ఇరువురికీ తెలియకుండా దుర్గయ్య అక్కడా.. ఇక్కడా సంసారం నడిపాడు.

ఆడపిల్లలు పుడుతున్నారని రెండు సార్లు గర్భం తీయించి.. హత్యాయత్నం చేసినట్లు రెండో భార్య ఆరోపించింది. తనను రెండో వివాహం చేసుకొని మోసగించిన నిందితుడిని అరెస్టు చేయటంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత మహిళ రామన్నపేట పోలీస్ స్టేషన్ ముందు న్యాయ పోరాటానికి దిగింది.

దుర్గయ్యపై ఫిర్యాదు ఇచ్చి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా తనకు అన్యాయం చేస్తున్నారంటూ సదరు మహిళ వాపోయింది. అధికార పార్టీ అండతో దుర్గయ్య తప్పించుకుని తిరుగుతున్నారని.. ఎవరూ తనకు మద్దతు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు మహిళ ఆరోపించింది.

రామన్న పేట సీఐ శ్రీనివాస్ ఫోన్​లో రేపటి వరకు నిందితుడు దుర్గయ్యని అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది. న్యాయ పోరాటం చేస్తున్న బాధిత మహిళకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.