మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన లావణ్యకు తూప్రాన్‌కు చెందిన సంతోశ్‌తో 2016లో వివాహం జరిగింది. కట్నం కింద సంతోశ్‌కు రూ.10 లక్షలు, బంగారం ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్న సంతోశ్ అసలు భాగోతం వివాహం తర్వాత బయటపడింది.
మొదటికాన్పులో ఆడపిల్ల పుట్టిందని రూ.5 లక్షలు తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్తతో పాటు అత్తమామలు, మరిది వేధించడం వల్ల లావణ్య తల్లిదండ్రులు అంత మొత్తం ముట్టజెప్పి ఆమెను అత్తింటికి పంపించారు. రెండోసారీ అమ్మాయే పుట్టిందని రూ.15 లక్షల రూపాయలు తీసుకురావాలని మరోసారి వేధించారని లావణ్య వాపోయింది. డబ్బు ఇవ్వలేదని తనను ఇంట్లో నుంచి పంపించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది.
సంతోశ్‌పై జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సరిగ్గా స్పందించలేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఇంకెవరూ మోసపోకూడదని తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
- ఇదీ చూడండి : "వేధింపులే లక్ష్యం... లోన్ వసూలుకు మార్గం"