ETV Bharat / jagte-raho

మహిళ దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం..! - women murder at bhuvanagiri

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి వేళ ఓ మహిళను కిరాతకంగా హతమార్చి, నిందితుడు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

women murder at bhuvanagiri
మహిళ దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం..!
author img

By

Published : Nov 12, 2020, 8:49 AM IST

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరి పట్టణ శివారులోని బైపాస్​ రోడ్డు సమీపంలో అర్ధరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలు జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడుగుకు చెందిన బోలు లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నారు.

లక్ష్మి భర్త 15 ఏళ్ల కింద మరణించాడు. బతుకు దెరువు కోసం పిల్లలతో హైదరాబాద్​ వెళ్లింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసుకుంటూ జీవనం సాగించేది. 2017లో అదే గ్రామానికి చెందిన ఆర్య కుమార్​గౌడ్​తో పరిచయం అయింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది నెలలుగా వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరుగుతోందని పేర్కొన్నారు.

హత్య ఎక్కడ జరిగింది..

బుధవారం అర్ధరాత్రి వారిద్దరూ.. హైదరాబాద్​ నుంచి భువనగిరి బైపాస్​ వద్దనున్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నగదు లావాదేవీల విషయంలో మాటా మాటా పెరిగింది. సర్జికల్​ బ్లేడ్​తో ఆర్యకుమార్​గౌడ్​.. లక్ష్మిని కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: మహిళ మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.