రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. అతికిరాతకంగా రాయితో మోది చంపిన ఘటన బుధవారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని ఓ వెంచర్లో చోటు చేసుకుంది. మృతురాలు ఎత్తిరి లక్ష్మి(28)గా గుర్తించారు.
15 రోజుల క్రితం ఉపాధి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం నుంచి జంగం లక్ష్మి.. తన భర్త వెంకటప్పతో కలిసి వచ్చింది. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమవగా.. రెండేళ్ల పాప ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న మొయినాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వసతి గృహంలో అనారోగ్యంతో వృద్ధుడు మృతి