ETV Bharat / jagte-raho

మనోహరాబాద్‌లో గుర్తు తెలియని మహళ హత్య - మహిళ మృతదేహం లభ్యం

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 50ఏళ్ల మహిళను హతమార్చి ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కన పడేసినట్లు అనుమానిస్తున్నారు. పాత కక్షలా? లేక ఆభరణాల కోసమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

woman murder at manoharabad in medak district
మనోహరాబాద్‌లో గుర్తు తెలియని మహళ హత్య
author img

By

Published : Oct 12, 2020, 12:13 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 50 ఏళ్లు ఉండే మహిళను హత్య చేసి ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కన పడేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా... సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సీఐ పరిశీలించారు.

'పాత కక్షలు కారణమా? లేక మహిళ శరీరంపై ఆభరణాలు లేనందున అవి తీసుకుని హత్య చేశారా?' అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ సీఐ స్వామి గౌడ్ తెలిపారు.

ఇదీ చదవండి: దారుణం... మురికి కాల్వలో పసిపాప దేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.