ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా కాలు జారి మహిళ మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.
ఇవాళ ఉదయం 5 గంటలకు మానాపురం నుంచి సూర్యాపేటకు వెళ్లేందుకు భూక్యా బుజ్జి.. రావులపల్లి క్రాస్ రోడ్డుకు వచ్చారు. ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడిపోయింది. బస్సు వెనుక చక్రాల కింద పడడం వల్ల ఆమె తలకు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు.
గ్రామంలో కూరగాయల వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్న బుజ్జి.. వాటిని కొనేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: కాలు జారీ బస్సు కింద బడి మహిళ దుర్మరణం