ETV Bharat / jagte-raho

అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా... మహిళ మృతి - రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అదుపు తప్పిన ద్విచక్రవాహనం బోల్తా పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని రాణాపూర్ గ్రామంలో ఘటన జరిగింది.

Woman killed after two-wheeler overturns in nirmal dist
అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా... మహిళ మృతి
author img

By

Published : Dec 2, 2020, 10:42 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని రాణాపూర్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన క్యాస్తు సాయన్న తన కూతురికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భార్య స్వప్నలతతో కలిసి నిర్మల్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఉంటున్న అత్తగారింటికి బయలుదేరారు. రాణాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో వెనకాలే కూర్చున్న స్వప్నలత(25) కింద పడిపోయింది. తల వెనుక భాగం రోడ్డును బలంగా తాకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సాయన్న, కూతురు యశస్వికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి:తెలంగాణ : సంగారెడ్డిలో బాలికపై అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.