నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో సారిక అనే మహిళా రైతు మృతి చెందింది.
తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా.. చేనులోని కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ తీగకు విద్యుత్ సరఫరా అయింది. గుర్తించని సారిక తీగకు తగలడం వల్ల ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైంది. అక్కడికక్కడే మృతి చెందింది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే సారిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సారిక మృతదేహంతో విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.
చర్యలు తీసుకోవాలి..
గతంలోనూ కొన్ని పశువులు విద్యుదాఘాతంతో చనిపోయాయని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.