భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటన్న నగర్లో విషాదం చోటు చేసుకుంది. పశువులను మేతకి తీసుకెళ్లిన మాడే ఎర్రమ్మ అనే మహిళ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
హైటెన్షన్ తీగలు చెట్లకు తగిలి ఉండడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. రోజూలాగే పశువులను మేతకి తీసుకెళ్లిన మహిళ ఆకస్మిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి