ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దోమ ఇందిర... ఉపాధి పనులకు వెళ్లి వచ్చి సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
ఇంట్లో నుంచి చాలాసేపటి వరకు బయటకు రాకపోవడం వల్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి భర్త రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: నేడు ప్రపంచ హార్ట్ డే.. ఆ వయసు వారిలో పెరుగుతున్న ముప్పు