మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ఆరు ముక్కలు చేశారు. వేర్వేరు ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి హరిత హోటల్ సమీపంలో పాడేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శరీరభాగాలను బయటకు తీశారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు ? అసలు ఎందుకు హత్య చేశారు? కారణాలు ఏమిటి ? అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమిటి? హత్య చేసిన దుండుగులు ఎవరు? అనేది పోలీసులకు సవాలుగా మారింది. ఈ హత్యపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్