నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి అటవీ శివారులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన గుండా రజిత (33) గా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీనివాస్ తెలిపారు.
గత నెల 28న మృతురాలు తప్పిపోయినట్లు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెతో పరిచయమున్న గంగాధర్‌ను పోలీసులు విచారించగా... హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని అడవిలోకి తీసుకొచ్చి బంగారు ఆభరణాలు దొంగిలించి.. హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి : ఎయిమ్స్‌ను మరింతగా తీర్చిదిద్దుతాం: కిషన్ రెడ్డి