ETV Bharat / jagte-raho

కలకలం సృష్టించిన మద్యం దుకాణంలో దొంగతనం

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మద్యం దుకాణంలో దొంగతనం కలకలం సృష్టించింది. పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్‌లో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం దొంగతనం ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి వెళ్లినా.. స్పందించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది.

wine theft in wine shop
కలకలం సృష్టించిన మద్యం దుకాణంలో దొంగతనం
author img

By

Published : Apr 20, 2020, 3:15 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ వైన్‌ షాపులో దొంగతనం జరిగింది. చోరి జరిగిన విషయం పోలీసులు షాపు యజమానికి తెలియజేయడంతో అవాకయ్యాడు షాపు ఓనర్‌.

వేసిన షెటర్‌ వేసినట్లే ఉంది.. కానీ షాపులో మద్యం మాత్రం మాయమైంది. పక్కా ప్రణాళికతో నిన్న రాత్రి వైన్‌ షాపులో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు వెంబడించారు. వారిలో ఒకరిని పట్టుకున్నారు. వెంటనే యజమానికి ఫోన్‌ చేసి పోలీసులు సమాచారం ఇచ్చారు.

అయితే షాపు రెండు తాళాలు ప్రస్తుతం ఎక్సైజ్‌ అధికారులు వద్దే ఉన్నాయని యజమాని తెలిపారు. వారు వచ్చి షాపు తెరిస్తే తప్ప ఎంత సరుకు చోరికి గురైందనే విషయం తెలియదన్నారు. చోరి వార్త తెలిసిన వెంటనే తాను ఎక్సైజ్‌ సీఐకు సమాచారం ఇచ్చానని వైన్‌ షాప్‌ యజమాని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎక్సైజ్‌ అధికారులు తనిఖీకి రాకపోడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: పోలీస్ వేషంలో వచ్చి 16 మందిని చంపిన డాక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.