ETV Bharat / jagte-raho

భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా పతిని కాపాడి ప్రాణాలు విడిచింది ఓ పత్ని. భార్యా, భర్త బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చి ఓ వాహనం బైక్​ను ఢీకొట్టింది. ఆ వాహనం తమవైపు వచ్చే క్రమంలో భార్య గమనించి భర్తను పక్కకు నెట్టి తానూ ప్రాణాలు అర్పించింది. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది.

Wife saved husband and dead accident at medak district
భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య
author img

By

Published : Sep 30, 2020, 11:04 AM IST

భార్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

మెదక్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయలయ్యాయి. జగద్గిరిగుట్టకు చెందిన రామ్​కుమార్, మహేశ్వరి దంపతులు మెదక్​లో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొని స్వస్థలానికి తిరిగి వెళ్తున్నారు. ఆ క్రమంలో తూప్రాన్ మండలం నాగులపల్లి చౌరస్తా వద్ద వెనకనుంచి వచ్చి ఓ వాహనం ఢీకొట్టింది.

వేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించిన మహేశ్వరి తన భర్తను పక్కకు పెట్టి తానూ కిందపడిపోయింది. వాహనం కింద పడటం వల్ల తల చిద్రమై ఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవ పరీక్ష కోసం మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి చనిపోయిందని తన మూడేళ్ల కూతురికి ఎలా చెప్పాలని రామ్​కుమార్ రోదించిన తీరు కలచివేసింది.

ఇదీ చూడండి : తెలంగాణలో మరో 2,103 కరోనా కేసులు, 11 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.