భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అలుబాక గ్రామానికి చెందిన సుభాశ్ అనే కానిస్టేబుల్కి మణుగూరు మహిళతో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలైన తర్వాత సంవత్సరం నుంచి మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
కాగా విషయం తెలుసుకున్న సుభాశ్ భార్య... భర్త భద్రాచలంలోని ఓ ప్రైవేటు లాడ్జి గదిలో ఓ మహిళతో ఉన్నాడని తెలుసుకుని కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది. ఇద్దరిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించి, వివాహేతరబంధం పెట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య