నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్టకు చెందిన నవీన్‌కు ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన నవనీతతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సంవత్సరానికి భర్త చనిపోయాడని, అప్పటి నుంచి మామ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు.
కొడుకు లేనప్పుడు నువ్వు ఎందుకు అంటూ వేధిస్తున్నారని చెప్పారు. ఇంట్లో ఉంటానని వచ్చిన తనను వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రావటంతో మామ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారని నవనీత చెప్పారు. న్యాయం చేయాలంటూ కూతురుతో కలిసి గేటు ముందు బైఠాయించింది.
ఇదీ చూడండి:టిక్‌టాక్ సీఈఓ పదవికి కెవిన్ రాజీనామా.. కారణమిదే