ETV Bharat / jagte-raho

భర్తను చంపిన భార్య: ప్రేమించి పెళ్లాడింది.. వద్దనుకుని చంపేసింది! - anantapur dst murder news

కులాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇంతలో అనుమానం పెనుభూతమై.. క్షణికావేశంలో ప్రేమించిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. ఈ హృదయవిదారక ఘటన అనంతపురంలో జరిగింది.

wife-murdered-her-husband-in-anantapur-dst
దారుణం: అనుమానంతో భార్తను చంపిన భార్య
author img

By

Published : Jul 23, 2020, 2:35 PM IST

అనుమానంతో భర్తను భార్య హత్యచేసిన ఘటన ఏపీ అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు.. మల్లేశ్వరిరోడ్డుకు చెందిన హర్షవర్దన్‌రావు(35) నగరంలోని మారుతినగర్‌కు చెందిన గంగాదేవిని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. హర్షవర్దన్‌ నర్సరీ సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పైపులను బిగించే రేంచీతో భార్య.. భర్త తలపై దాడి చేసింది.

తీవ్రంగా గాయపడిన భర్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. భార్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికులు 100కు ఫోన్‌ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్దన్‌ మృతిచెందాడు. ఇతనికి మరో మహిళతో పరిచయం ఉండటంతో భార్య అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది. రెండో పట్టణ సీఐ జాకీర్‌హుసేన్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా అనుమానంతో దగ్గరకు రాని స్థానికులు

హర్షవర్దన్‌రావు తల్లిదండ్రులు అతని వద్దనే ఉంటున్నారు. వీరి కుటుంబసభ్యుల్లో ఒకరు కరోనా వైరస్‌ సోకగా ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. బాధితుడు కరోనా రోగికి ప్రాథమిక కాంట్రాక్టు అయినప్పటికీ పోలీసులు సాహసం చేసి అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి

చుంచులూరు జాతీయ రహదారిపై ప్రమాదం... భార్యభర్తలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.