ETV Bharat / jagte-raho

తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను నరికి చంపిన భార్య - wife murdered her husband in a family quarrel

wife-murdered-her-husband-in-a-family-quarrel
తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను నరికి చంపిన భార్య
author img

By

Published : Oct 5, 2020, 9:37 AM IST

Updated : Oct 5, 2020, 2:19 PM IST

09:35 October 05

తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను నరికి చంపిన భార్య

     నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. కత్తితో భర్తను నరికి చంపింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. ఈ దారుణ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

    నాగర్​ కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలం రాళ్లచెరువు తండాకు చెందిన శంకర్, లక్ష్మి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన శంకర్.. నిత్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురి చేసేవాడు. మద్యం మత్తులో సైకోలా ప్రవర్తించేవాడు.

     ఆదివారం సైతం తాగొచ్చి వేధించడం వల్ల విసిగిపోయిన భార్య లక్షి శంకర్​పై కత్తితో దాడి చేసింది. తల, మెడ, ముఖంపై నరికింది. తీవ్ర గాయాలైన శంకర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితురాలు ఉదయం తిమ్మాజీపేట పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చూడండి: అమానుషం... బాలుడిని దారుణంగా హత్య చేసిన పిన్ని

Last Updated : Oct 5, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.