ETV Bharat / jagte-raho

ఓ ఇల్లాలి క్రైమ్ కథ.. భర్తను ఎందుకు చంపిందో తెలుసా..!

ఒకరి అనాలోచిత నిర్ణయం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వివాహేతర సంబంధం మోజులో పడి భర్త అడ్డు తొలగించుకున్న భార్య చివరికి కటకటాల పాలైంది. చదువుకుని ఉద్యోగ వేటలో ఉన్న యువకుడు ఓ మహిళ కోసం హత్య చేశాడు. శవాన్ని మాయం చేసేందుకు తమ్ముని సాయం తీసుకుని.. అతని జీవితాన్నీ అంధకారం చేశాడు. లోకమెరుగని ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు.

wife murderd his husband with his lover in nizamabad

author img

By

Published : Nov 4, 2020, 9:59 AM IST

Updated : Nov 4, 2020, 2:57 PM IST

ఓ ఇల్లాలి క్రైమ్ కథ.. భర్తను ఎందుకు చంపిందో తెలుసా..!

నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన నారాయణ... ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగి. నగరానికి చెందిన శిరీష నారాయణకు దగ్గరి బంధువు. శిరీషకు గతంలో పెళ్లి కాగా... వ్యక్తిగత కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. వరుసకు బావయ్యే నారాయణను రెండో పెళ్లి చేసుకుంది. నారాయణకు సైతం ఇది రెండో పెళ్లి. వినాయక్​నగర్​లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే పోలీసు కానిస్టేబుల్ కుమారుడు ఫణీంద్రప్రసాద్​తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

10 గంటలు శవంతో జాగారం....

భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసిన భర్త..సాయి ప్రియ నగర్​కు మకాం మార్చాడు. అయినా భర్తకు అనుమానం రాకుండా ప్రియుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. అనుమానంతో నారాయణ ప్రతీసారి ఆరా తీయటం వల్ల... భర్త అడ్డు తొలిగించుకోవాలని శిరీష నిర్ణయించుకుంది. అనారోగ్యంతో ఈనెల 26న ఇంట్లో నిద్రిస్తున్న నారాయణను ప్రియుడితో కలిసి హతమార్చింది. కత్తితో పొడిచి గొంతు కోసి కిరాతకంగా చంపేసింది. అనంతరం భర్త శవాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి... 10 గంటల పాటు స్నానాల గదిలో ఉంచారు. అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఫణీంద్ర ప్రసాద్, అతని సోదరుడు మహేంద్ర ప్రసాద్ సహకారంతో శవాన్ని మోపాల్ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలోని ఓ గుంతలో పారేశారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా...

మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తీగ లాగితే అసలు డొంక కదిలింది. శవాన్ని బండిపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనుమానంతో భార్యను విచారించగా... అసలు నిజం బయట పడింది. పదునైన కత్తితో కడుపులో పొడిచి హత్య చేసినట్లు శిరీష ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు వినియోగించిన కత్తితో పాటు మృతదేహాన్ని తరలించడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిరీష, ఫణీంద్ర ప్రసాద్, మహేంద్ర ప్రసాద్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

సాఫీగా సాగుతున్న సంసారంలో... వివాహేతర సంబంధంతో పక్కదారిట్టిన ఆ భార్య... భర్తను కోల్పోయింది. ఇద్దరు యువకుల జీవితాలను అంధకారంలోకి నెట్టి తానూ కటకటాల పాలైంది.

ఇదీ చూడండి: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

Last Updated : Nov 4, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.