ETV Bharat / jagte-raho

'ప్రియుడితో కలిసి అమ్మే నాన్నను చంపేసింది' - తాజా నేరవార్తలు

ప్రియుడితో కలిసి తన తండ్రిని తల్లే చంపేసిందని ఓ యువతి(18) శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని సఖినేటిపల్లిలో చోటుచేసుకుంది.

wife killed her husband in skhinetipally, ap
'ప్రియుడితో కలిసి అమ్మే నాన్నను చంపేసింది'
author img

By

Published : Jun 27, 2020, 11:42 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని సఖినేటిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తొలుత సహజ మరణంగా భావించిన వ్యక్తి మృతి... హత్యగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..?

సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో ఈనెల 2న ఉప్పు ప్రసాద్‌(48) అనే వ్యక్తి మృతిచెందారు. ఇతడిది సహజ మరణంగా భావించి గ్రామస్థులు, బంధువులు ఈనెల 3న మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై మృతుడి కుమార్తె తన తల్లి మీద అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తల్లి మేరీ ప్రశాంతి, కేశవదాసుపాలేనికి చెందిన చొప్పల సుభాకర్‌ ఆలియాస్‌ శివతో చనువుగా ఉంటోందని, తండ్రి చనిపోయిన తరువాత ఆమె ఫోన్లో మాట్లాడడం గమనించి రికార్డింగ్‌, ఛాటింగ్‌ ఆధారంగా ఆమెను ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరు తన తండ్రిని హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. నివేదికలో విషయాలు బహిర్గతం అవుతాయని, ప్రస్తుతం ప్రశాంతి, శివలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ చెప్పారు.

ఇదీ చూడండి : శ్రియ ఆలోచనతో ఆ పూలు వృథాకావు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.