వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన పద్మకు రంగారెడ్డి జిల్లా చింతల్‌కుంటకు చెందిన శ్రీనివాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయి పదేళ్లైనా పిల్లలు లేరని వేరొక మహిళతో శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడు.
భర్త వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భార్య పద్మ.. తన తండ్రితో కలిసి వారిద్దరూ ఉన్న ఇంటికి వెళ్లి వారిని చితకబాదింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: పట్టపగలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య