భర్త మరణవార్త విన్న భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొండంపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన డా. సలాది రామారావు (75) గుండెపోటుతో మరణించారు. తన భర్త మరణించాడన్నవార్త తెలుకుకున్న భార్య నిర్మల (65) సైతం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. మరణంలోనూ వీడిపోలేదంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా