ETV Bharat / jagte-raho

ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​తో వెబ్​సైట్ సంస్థ మోసం - Telangana news

మా వద్ద పెట్టుబడి పెట్టండి... పెట్టుబడిపై ఐదు శాతం వడ్డీ, 60 రోజులకు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామంటూ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​తో వెలిసిన ఓ వెబ్​సైట్ సంస్థ మోసం చేసిందంటూ ఇద్దరు బాధితులు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​తో వెబ్​సైట్ సంస్థ మోసం

author img

By

Published : Jan 14, 2021, 10:11 PM IST

ఓ వెబ్​సైట్ సంస్థ తమను మోసం చేసిందంటూ... ఇద్దరు వ్యక్తులు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్​ గాంధీనగర్​కు చెందిన ఇద్దరు వ్యాపారులు... స్టెమెక్స్ ఎడ్జ్ పేరుతో ఉన్న ఓ వెబ్​సైట్ సంస్థ నుంచి ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​లోకి వెళ్లారు. అందులో రోజుకు ఐదు శాతం వడ్డీ ఇస్తామంటూ నిర్వాహకులు వారిని నమ్మించారు.

గాంధీనగర్​కు చెందిన ఓ వ్యాపారి రూ. 50 వేలు, మరో వ్యక్తి రూ. లక్ష అందులో పెట్టుబడి పెట్టారు. వడ్డీ బ్యాంకు ఖాతాల్లోకి జమ కాకపోవడం వల్ల ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెజాన్ ఏడబ్ల్యూఓ పేరుతోనూ పలువురికి ఈ సంస్థల నిర్వహాకులు టోకరా వేశారు.

ఇదీ చదవండి: అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.