అనంతపురం జిల్లా నార్పల మండలం ఉయ్యాలకుంటాలో సుబ్రమణ్యం గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఓ వివాహితకు ప్రేమ లేఖ రాసిచ్చాడు. ఇదేనా ఒక వాలంటీర్ పద్ధతి అంటూ ఎంపీడీవో కార్యాలయం ముందు వివాహిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
సుబ్రమణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ప్రభు.. ఈ వివాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడనీ, అతడపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రేమ లేఖ అందించిన వాలంటీర్ సుబ్రమణ్యంకు వివాహిత కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.