ETV Bharat / jagte-raho

పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. మహిళా వాలంటీర్ మృతి - వాలంటీర్ మృతి వార్తలు

డీఈడీ పరీక్షలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళా వాలంటీర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. షేక్ రూబియా బేగం పరీక్ష రాసి ద్విచక్రవాహనంపై తన భర్తతో కలిసి తిరుగు పయనమైంది. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్​ను ఢీకొట్టింది.

volunteer-death-in-road-accident-occured-at-guntur-district
పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
author img

By

Published : Dec 19, 2020, 9:38 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రూబియా బేగం.. పట్టణంలోని 20వ వార్డు వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. డీఈడీ ఆఖరి సంవరత్సరం పరీక్షల నిమిత్తం.. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలకు తన భర్త ఫణిదరపు అశోక్ కుమార్​తో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. చిలకలూరిపేట రోడ్డులోని ఓవర్ బ్రిడ్జ్ పైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూబియా బేగం తీవ్రంగా గాయపడటంతో.. జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ రూబియా బేగం ఇవాళ మృతి చెందినట్లు.. రెండో పట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి : సహనం కోల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.