సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి నుంచి శనిగరం వెళ్లే దారిలో పిల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో వంతెన మునిగిపోయింది. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో వంతెన దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గుర్తించిన స్థానికులు అతడిని రక్షించి ప్రాణాలు కాపాడారు.
కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం షేర్అలీనగర్కు చెందిన సయ్యద్ మోతి వంతెన దాటుతూ అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అతడిని గుర్తించిన రాజేందర్, జాలిగాం నరేష్ సహా పలువురు గ్రామస్థులు మోతిని బయటకు తీసి ప్రాణం నిలబెట్టారు. ద్విచక్రవాహనానికి తాడుకట్టి లాగి ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలు కాపాడిన గ్రామస్థులను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు