ETV Bharat / jagte-raho

19ఏళ్ల యువతి కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం - వికారాబాద్

వికారాబాద్​లో వివాహిత కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ పుటేజ్, కాల్ డేటా ఆధారంగా ఆమె భర్తనే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

vikarabad-kidnap-case-police-suspect-her-husband
వికారాబాద్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం... భర్తపైనే అనుమానం
author img

By

Published : Sep 29, 2020, 5:38 PM IST

వికారాబాద్​లో వివాహిత అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా భర్తే కిడ్నాపర్​గా ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలో ఆదివారం తన సోదరితో కలిసి షాపింగ్ ముగించుకుని వెళ్తున్న మణిదీపికను కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి పారిపోయారు.

2016లో ఆమె అఖిల్ అలియాస్ ఖలీల్​ను ప్రేమవివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే అతని వద్ద నుంచి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె తన భర్త నుంచి విడాకులు కావాలంటు కోర్టును అశ్రయించారు. తనకుమారుడు దీపికను వివాహం చెసుకున్న విషయం తెలుసని, కిడ్నాప్ విషయం తమకు తెలియదని అతని తండ్రి తెలిపారు.ఈ కిడ్నాప్​ ఆమె భర్తే చేశాడా,లేదా తను సహకరించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.