నారాయణపేట జిల్లా కొండారెడ్డిపల్లి చెరువులో రెండు రోజుల క్రితం గల్లంతైన వెంకటేశ్ మృతదేహం లభ్యమైంది. శనివారం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెరువు అందాలు తిలకించేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నిండిన చెరువు అందాలను చూసేందుకు శుక్రవారం నర్సింలు, వెంకటేశ్‌లు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడం వల్ల గల్లంతయ్యారు. నర్సింలు మృతదేహం శుక్రవారం లభ్యం కాగా.. వెంకటేశ్ మృతదేహం శనివారం లభ్యమైంది.
ఇదీచూడండి.. పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతం.. మహిళ దుర్మరణం